ఈవిఎం యంత్రాలపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2,3 వ తేదీలలో ఓటర్ల నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నామన్నారు.

పోలింగ్‌ కేంద్రాలలో బూతు స్థాయి అధికారులు అందుబాటలో ఉంటారని తెలిపారు అక్టోబర్‌ 1 నాటికీ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాలలో 1500 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉంటే మరో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసుకునే వీలుందని అన్నారు.

జిల్లాలో 790 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు . బి.ఎల్‌.ఓ.లకు శిక్షణ ఇచ్చామని చెప్పారు ఎల్లారెడ్డి నియోజకవరంల్లో 95 శాతం ఓటర్ల జాబితాకు ఆధార్‌ అనుసంధానం అయ్యిందని తెలిపారు. 2023 ఆగస్టు 21 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. అక్టోబర్‌ 4 న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని, ఆ జాబితా ప్రకారమే వచ్చే ఎన్నికలు జరుగుతాయని అన్నారు.

కామారెడ్డి కలెక్టరేట్‌ లోని ఈ.వి.ఏం. ప్రదర్శన కేంద్రం ను కలెక్టర్‌ తో పాటు వివివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటింగు యంత్రాల పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు నరేందర్‌, అనిల్‌ కుమార్‌, సురేష్‌, కాసిం అలీ, బాలరాజు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »