రెంజల్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు.
గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆయన వెంట రూరల్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై పి.ఉదయ్ కుమార్ ఉన్నారు.