ఆర్మూర్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. లబ్ధిదారులు జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అబ్దుల్ రెహమాన్, పడాల్ గణేష్, అభిలాష్ రెడ్డి, పీఏ శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.