రెంజల్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్:కష్టాన్ని ఇష్టంగా భావించి వ్యవసాయం చేసే రైతన్నలపాలిట ప్రకృతి ప్రకోపించి రైతన్నలకు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నీట మునిగాయి. నెలల తరబడి కష్టపడి పంటలను బతికించుకునే ప్రయత్నాలు చేసిన రైతులకు ప్రస్తుతం ఒకేసారి ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో పంటలు నీట మునిగాయి.
దింతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.నీటి మునిగిన పంటలను వ్యవసాయాధికారి లక్ష్మీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో పైరు త్వరగా కొలుకోవడానికి కొంత మేర యూరియా వాడకం వల్ల నష్టాన్ని నివరించుకోవచ్చన్నారు.