కామారెడ్డి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో శుక్రవారం సహాయ ఫౌండేషన్ నిర్వాహకులు, తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ వారి కుమార్తె శ్రీహిత జన్మదినం సందర్భంగా 30 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ కుటుంబ సభ్యుల జన్మదినోత్సవాలు, వివాహ దినోత్సవాలు, మహనీయుల వర్ధంతి, జయంతులకు రక్తదానం చేయడం ఒక మంచి సంప్రదాయమని, సమాజంలో రక్తదానం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరు గుర్తించాలని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006 నంబర్‌కి పంపించాలన్నారు. కుమార్తె శ్రీహిత జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాత హరిప్రసాద్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు,కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలియజేసి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో కేబిఎస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు జీవన్, వెంకటేష్, నీరజ హరిప్రసాద్, టెక్నీషియన్లు సంతోష్ పాల్గొన్నారు.