ఆర్మూర్, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 24 వ వార్డ్‌కి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం స్థానిక కౌన్సిలర్ ఆకులరాము ఆయన కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్బంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కెసిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ రాము మాట్లాడుతు పేదింటి ఆడపడచు కట్నంగా లక్ష నూట పదహారు రూపాయలను అందిస్తూ పేదప్రజలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్, ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అలాగే పెద్దసంఖ్యలో చెక్కులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.