బాన్సువాడ, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పిండ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు, వరదల్లో మృతి చెందిన వారికి 20 లక్షల రూపాయలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాలేక్,పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు హన్మాండ్లు, కాంగ్రెస్ నాయకులు పర్వ రెడ్డి, గొల్ల వెంకన్న యాదవ్, కొట్టం గంగాధర్, జీవన్, ఆఫ్రోజ్, బట్టి శేఖర్, కాసిం, మన్నె విట్టల్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.