బీర్కూర్, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎలమంచిలి శ్రీనివాసరావు, పిసిసి డెలిగేట్లు డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో అందరు కార్యకర్తలు సమిష్టి కృషితో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఇక్బాల్, మాజీ సర్పంచ్ బసవరాజ్, తోట నారాయణ, అమృత్ కృష్ణారెడ్డి, ఓంకార్, హన్మకొండ సిద్ధప్ప, విజయ పటేల్ పాల్గొన్నారు.