ఆర్మూర్, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలములోని కోమన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరితహారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3034 విత్తనబంతులు తయారు చేశారు. ఇందులో నేరేడు656 వేప357, కానుగ 500, అల్లనేరేడు 1521ఉన్నాయి. వీటిని రోడ్ల కిరువైపుల, ఊరి బయటవేయడం జరిగింది.
విద్యార్థుల కృషి,ఆలోచనను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలూరి నర్సయ్య, గ్రామసర్పంచ్ నీరడి రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటి అధ్యక్షులు రోహన్ గౌడ్, ఉపాధ్యాయులు ఆనంద్, శ్రీనివాస్, గడ్డి చిన్నయ్య, సాయన్న, జయశ్రీ, చిన్నయ్య, రాజేందర్ గౌడ్, గ్రామస్తులు నరేశ్, సునీల్, సురేశ్, ప్రసాద్, రమేశ్, ముత్తెన్న, విద్యార్థులు పాల్గొన్నారు.