ఈ సంవత్సరం ఆకస్మిక తనిఖీలుంటాయి

డిచ్‌పల్లి, ఆగష్టు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రధాన ఆచార్యుల సమావేశానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం. యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలో అన్ని విద్యాసంస్థలలో అకాడమిక్‌ వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు.

కోవిడ్‌ కాలంలో విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అత్యంత క్రమశిక్షణతో నిర్వహించే తరగతి గది ప్రధాన భూమిక పోషిస్తుందని తరగతి గది ద్వారానే విద్యార్థులలో విజ్ఞానంతో పాటు సామాజిక, నైతిక, మరియు ప్రజాస్వామ్య విలువలు పెంపొందించవచ్చునని సూచించారు.

దీనికి విద్యార్థికి- అధ్యాపకులకు తరగతిగదిలో ఆరోగ్యకరమైన సజీవ సంబంధాలు ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి అర్హులైన విషయ నిపుణులను ఎంపిక చేసుకొని విశ్వవిద్యాలయం నుండి అనుమతి పొందాలని పేర్కొన్నారు. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య గంటా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కళాశాలల బకాయిలను సకాలంలో చెల్లించాలని కళాశాలలో పటిష్టమైన ల్యాబ్‌, గ్రంథాలయ సౌకర్యాలను పునరుద్దించాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అకస్మాత్తుగా తనిఖీలు ఉంటాయని నిబంధనలు పాటించని కళాశాలపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ డా. అతిక్‌ సుల్తాన్‌ గోరితో పాటు విశ్వవిద్యాలయ పరిధిలోని 60 కి పైగా కళాశాల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »