కామారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ హైవే అధికారులు ఆక్సిజన్ వెంటిలేటర్‌ను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు వితరణ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ అంబులెన్స్ లో ఈ ఆక్సిజన్ వెంటిలేటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీనివాసరావు,మధుసూదన్ రావు, ఆర్ అండ్ బి ఈఈ రవిశంకర్, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.