కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని 36 వ వార్డు ఇంచార్జి దేవుని సూర్యప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 36 వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 36 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దేవుని సూర్య ప్రసాద్ అన్నారు.
శనివారం పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం పేరుతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రవేశ పెట్టె పథకాలను ప్రజలకు వివరించారు. కుటుంబపాలనా పార్టీ టీఆర్‌ఎస్ పార్టీని గద్దెదించడం ఖాయమని అన్నారు. తెరాస ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎవరికి కూడా న్యాయం జరగలేదన్నారు.
కార్యక్రమంలో నాయకులు చందు, శంకర్ రావు, కిషన్ రావు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.