బాన్సువాడ, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా మొదటిసారి గ్రామానికి విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కు గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గ్రామంలోని పల్లె ప్రగతి కింద అభివృద్ధి అయిన పనులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి పచ్చదనాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జగన్నాథరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకట రమణారావు దేశ్ముఖ్, ఎంపిటిసి జేట్టి హన్మండ్లు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏపీవో మల్లేష్, పంచాయతీ కార్యదర్శి భరత్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.