కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బోరింగ్ రాజయ్య అనే రైతు నేషనల్ హైవే 44 పక్కన టేకిరాల శివారులోతెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీపై ఆయిల్ ఫామ్ పంటను సాగు చేశారు. రైతులను వాణిజ్య పంటల వైపు మళ్ళించడానికి తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా రైతు రాజయ్య ఆయిల్ ఫామ్ సాగు చేశారు.
అందులో పండగ డ్రాగన్ ఫ్రూట్స్ కూరగాయలు తదితర పంటలను సాగు చేశారు. తమ ప్రాంతంలో కూడా ఈ పంటను సాగు చేయించే విధంగా రైతులను ప్రోత్సహించాలని సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు పద్మాజివాడి సింగిల్ విండో చైర్మన్ గంగాధర్ తో కలిసి పంటలను పరిశీలించారు. ఆ తోటలో పనిచేస్తున్న రసీదు గత ఆరు నెలల క్రితం ఆయిల్ ఫామ్ పంటను సాగు చేశామన్నారు, గ్రోత్ బాగుందన్నారు.
ఇటీవలే అంతర్ పంటగా వివిధ పండ్ల మొక్కలను అరటి, డ్రాగన్ ఫ్రూట్స్, నేరేడు తోపాటు ఆకుకూరలు సాగు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలోచన విధానం వల్ల వాణిజ్య పంటల దృష్టి మళ్లించి పెద్ద ఎత్తున సాగు చేసి రైతుల ఆర్థికంగా ఎదగాలని కెసిఆర్ సంకల్పంతో ఉన్నారని మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు అన్నారు.