నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను న్యాయవాదులు సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యారంగం ఆధ్వాన్నంగా తయారైందని ఉపాధ్యాయులకు పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసి మద్యంతర బృతిని ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ సిపిఎస్ పునరుద్ధరించాలని, 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో కనీస వసతులు మరుగుదొడ్లును ఏర్పాటు చేయాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయ సంఘం నాయకుడు కర్నే శంకర్, న్యాయవాదులు వసంతరావు, రంజిత్, సుతారి శ్రీమాన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.