బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నియమించారు. గతంలో నిజామాబాద్‌ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడికి పనిచేసిన కొయ్యాడ శంకర్‌ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్‌ చేసిన సేవలను బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంకనాల శ్యాం కొనియాడారు. పలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి యువతకు మార్గదర్శకులుగ కొయ్యాడ శంకర్‌ నిలబడ్డారని గుర్తు చేసారు. కొయ్యాడ శంకర్‌ తను నిబద్దతతో ఎన్నో బీసీ సభలను విజయవంతం చేసారని అని అన్నారు.

తనను నమ్మి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు ఇప్పించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌కు కొయ్యాడ శంకర్‌ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ లోని రాష్ట్ర కార్యాలయంలో నియామక కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంకనాల శ్యాం, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌, జిల్లా యువజన సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »