కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డిలో ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల అనంతరం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రుణాలు పంపిణి చేశారు. పంట రుణాల క్రింద జిల్లాలోని రైతులకు 1,319 కోట్ల చెక్కును, మహిళా సమాఖ్య కు 36 కోట్ల 47 లక్షలు, పట్టణ పేదరిక నిర్మూల సంస్థ క్రింద స్వయం సహాయక సంఘాలకు 5 కోట్ల చెక్కులను అందజేశారు.
286 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు, 58 శాఖలలో విశిష్ట సేవలు చేసిన 294 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, శాసనసభ్యులు సురేందర్, హనుమంత్ షిండే, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.