నిజామాబాద్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు జిల్లాలో ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో 5కె రన్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5కె రన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు స్వచ్చందంగా పాల్గొని 5కె రన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.