టియు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రాష్ట్ర ఉత్తమ ఉర్దూ అధ్యాపక అవార్డు

డిచ్‌పల్లి, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ మరియు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌ సంయుక్త నిర్వహణలో ఉర్దూ శాఖలో ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు.

ఈ సందర్భంగా ఆచార్య ఎం యాదగిరి మహమ్మద్‌ అబ్దుల్‌ ఖవిని శాలువా మెమొంటోతో పాటు ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు. డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి 2014 నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉర్దూ శాఖ పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో వార్డెన్‌గా, చీప్‌ వార్డెన్‌గా, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా, అడిషనల్‌ కంట్రోలర్‌గా, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా అనేక బాధ్యతలు నిర్వహించి ఉత్తమ ఉద్యోగ అవార్డు స్వీకరించారు. అత్యంత ప్రతిభావంతమైన అబ్దుల్‌ ఖవి రాసిన పుస్తకాలు అంబేద్కర్‌ యూనివర్సిటీ, మాను విశ్వవిద్యాలయంలో రిఫరెన్స్‌ గ్రంథాలుగా గుర్తించబడినాయి.

లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ మౌలిక పరిశోధకుడిగా భాషా సాహిత్యంపై పత్ర సమర్పణ చేసి ఉత్తమ పరిశోధకుడుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. అనేక అంతర్జాతీయ సదస్సులో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి ఉర్దూ శాఖలో అత్యుత్తమమైన రచనలు చేస్తూ ఉద్యోగిగా మౌలికమైన బాధ్యత నిర్వహిస్తూ పలువురు మన్ననలను పొందుతున్నారు.

డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖవికి ఈ అవార్డు రావడం పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ -చాన్సులర్‌ వాకాటి కరుణ అభినందనలు తెలిపారు. అవార్డు రావడం పట్ల ఉర్దూ విభాగాధిపతి డా. గుల్‌ -ఇ -రాణా, చైర్మన్‌ బిఓఎస్‌ డాక్టర్‌ మూసా ఖురేష్‌, డా. ఆంజనేయులు, డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌, డాక్టర్‌ నాగరాజు పాత, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ మావురపు సత్యనారాయణ, డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి, డాక్టర్‌ త్రివేణి, డాక్టర్‌ రాంబాబు, పిఆర్‌ఓ డాక్టర్‌ ఏ పున్నయ్య తదితర అధ్యాపక మిత్రులు ఈ సందర్భంగా మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి ని అభినందించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »