కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పందిరి తన్విరెడ్డి ‘‘ఇస్రో యువికా 2023’’ స్కూల్ పిల్లల కోసం చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమం యంగ్ సైంటిస్టుకు ఎంపికై 15 రోజులు శిక్షణ పొందిన తన్విరెడ్డి గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే యంగ్ సైంటిస్టు ప్రోగ్రాంకు ఎంపికైన 350 మందిలో తమ గ్రామ విద్యార్థిని ఎంపికై శిక్షణ పొందడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు వన్నె తెచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రేవతి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, విజయ డైరీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, ఎస్‌ఎంసి చైర్మన్ రమేష్, వార్డు సభ్యులు రాజిరెడ్డి, రేఖ, శ్యామల, గ్రామస్తులు బాలరాజు, మోహన్ రెడ్డి, విశ్వనాథం, సురేష్, పెంటయ్య పాల్గొన్నారు.