తెలంగాణ తొలి బహుజన వీరుడు పాపన్న

బీబీపేట్‌, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో శుక్రవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో తోలి బహుజన విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 373 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ వరంగల్‌ జిల్లా ఖిలాషపురంలో జన్మించిన పాపన్న గౌడ్‌ బహుజనులను అందరినీ ఏకం చేసి సబ్బండవర్ణాలను కలుపుకొని గోల్కొండ కోటను అధిష్టించిన వీరుడని అన్నారు.

గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను పట్టించుకోకుండా గీత వృత్తిని పూర్తిగా విస్మరించి నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా వారు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్‌ గీత చెట్టు పను రద్దుచేసి హరితహారంలో భాగంగా గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఈత చెట్లు నాటించారని అన్నారు మద్యం దుకాణాలల్లో గౌడ్లకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వారు అన్నారు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి, వర్ధంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ మధ్యనే హైదరాబాదులో కోకాపేటలో గౌడ కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోరకు ఐదు ఎకరాల భూమిని, ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు నియోజకవర్గంలో గౌడ సంఘ కుల అత్మ గౌరవ భవనాలు నిర్మించుకొనుటకు ప్రభుత్వం విప్‌ గంప గోవర్ధన్‌ నిధులు మంజూరు చేస్తూ గౌడ కులస్తులకు తన వంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారాగౌడ్‌, కిష్టాగౌడ్‌, సిద్దాగౌడ్‌, వెంకట్‌ స్వామి గౌడ్‌, నర్సాగౌడ్‌, రామగౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, దుర్గాగౌడ్‌, శ్రీధర్‌ గౌడ్‌ బొప్పన్నగౌడ్‌, శ్రీమాన్‌ గౌడ్‌, సాయి గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »