లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం
కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని కోరారు.

లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు తమ పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. రైతులకు పంట రుణాలు, టర్మ్‌ లోన్‌ లు, వ్యవసాయ అనుబంధ రుణాలు విరివిగా అందించాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయగా జిల్లాలో 32 వేల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కాగా 4,359 మంది రైతులకు సంబంధించి డబ్బులు పెండిరగ్‌ ఉన్నాయని, వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా వ్యవసాయ శాఖ బ్యాంకర్లకు సూచించారు. ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీ, పరిశ్రమలు, డిఆర్‌ డిఓ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ నిర్మాణం, ఇతర ప్రాధాన్యత రంగాలకు అర్హులైన పేద లబ్దిదారులకు మంజూరు చేయాలనీ కోరారు.

చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవగాహన కలిగిస్తూ విరివిగా రుణాలు అందించాలని కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిర్ణిత గడువులోగా రుణాలు మంజూరు చేయాలనీ అన్నారు.బ్యాంకులో దరఖాస్తులు పెండిరగులో లేకుండా చూసుకోవాలని, తిరస్కరణకు గురైన వాటిని పరిశీలించి తగు రీతిలో బ్యాంకులు పంపాలని అధికారులకు సూచించారు.

స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వన్‌ టైం సెట్టిల్మెంట్‌ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆర్ధిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలపై అవగాహనా కలిగించాలని బ్యాంకర్లకు సూచించారు.

లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ భార్గవ్‌ సుధీర్‌, కెనరా బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ అంబరీష్‌, తెలంగాణా గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ నవీన్‌, ఆర్‌.బి.ఐ.అధికారి అనిల్‌, నాబార్డ్‌ అధికారి ప్రవీణ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మేనేజర్‌ అనిల్‌, హెచ్‌ డి ఎఫ్‌ సి మేనేజర్‌ సుధాకర్‌, డిఏఓ భాగ్యలక్ష్మి, ఎస్సి అభివృద్ధి అధికారి దయానంద్‌, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ లాలూ నాయక్‌, మత్స్య శాఖాధికారి వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »