కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ మేన్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారాం నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్ట్ ఆపీస్లో వచ్చిన విలువైన ఉత్తరాలు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్ పోర్టులు, ఏటీఎం కార్డులు, ఎల్‌ఐసి బాండ్లు ఇతర విలువైన ఉత్తరాలను గత 8 నెలలుగా పోస్టులో వచ్చిన ఉత్తరాలని వారికి ఇవ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు.
పట్టణానికి చెందిన ప్రజలు తమ ఉత్తరాలు రాలేదని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా పోస్ట్ ఆఫీస్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వేణు అధికారులు పోస్ట్ మెన్ సీతారాం ఇంట్లో శనివారం తనిఖీలు నిర్వహించగా పోస్ట్ మాన్ సీతారం ఇంట్లో 50 బస్తాలలో పాన్ కార్డులు, పాస్ పోర్టులు, ఆధార్ కార్డులతో పాటు ఇతర విలువైన ఉత్తరాలు దొరికాయి.
పోస్ట్ ఆఫీస్‌లో వచ్చిన ఉత్తరాలని ప్రజలకు ఇచ్చినట్లు తమ సెల్ ఫొన్‌లకు మెసేజ్‌లని పోస్ట్ మాన్ సీతారాం మెసేజ్లు చేయగా భాదితులు అనుమానానికి గురయ్యారు. దీంతో బాదితులు పోస్ట్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయగా పోస్ట్ మెన్ సీతారాం నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.