నిజామాబాద్, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించిన బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వము ప్రధానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశువు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ రసూల్ బి ఒక ప్రకటనలో తెలిపారు.
నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభాపాటాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రధానం చేస్తారు అని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 18 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలు అర్హులన్నారు.
అర్హులైన బాల బాలికలు దరఖాస్తులను వెబ్సైట్లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రసూల్ బి జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశువు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలిపారు.