డిచ్‌పల్లి, జూలై 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ‘‘భూ న్యాయం వివాదాలు – పరిష్కారాలు’’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ఉదయం వర్చువల్ వేదికగా ప్రారంభమైనది. వెబినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ భూమి స్వర్గసీమ అని, తల్లి వంటిదని అన్నారు. భూమి మీద బ్రతికే ప్రతి వ్యక్తికి భూ అవసరాలు ఉంటాయన్నారు.
భూమితో మనిషికి అవినాభావ సంబంధం ఉంటుందని, ఆస్తులు ఎక్కువగా భూ ఆర్జన రూపంలో ఉంటాయన్నారు. ఆస్తి తగాదాలు భూ సమస్యలతోనే ఏర్పడుతాయని పేర్కొనారు. అందుకే కేవలం న్యాయ శాస్త్ర విద్యార్థులే గాకుండా ప్రతి ఒక్కరు భూన్యాయ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వెబినార్‌లో ప్రధాన వక్తగా ప్రముఖ వక్తగా ఎం. సునీల్ కుమార్ హాజరై భూన్యాయం మీద ప్రసంగించారు.
వెబినార్‌లో రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్, వెబినార్ డైరెక్టర్ డా. ప్రసన్న రాణి, కన్వీనర్ విభాగాధిపతి డా. బి. స్రవంతి, కో – కన్వీనర్ డా. జెట్లింగ్ ఎల్లోసా, ఆర్గనైజర్ డా. ఎం. నాగజ్యోతి తదితర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.