కామారెడ్డి, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26, 27, సెప్టెంబర్ 2,3 వ తేదీల్లో బూతు లెవల్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులకు, పర్యవేక్షకులకు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. బూతు లెవల్ అధికారులు ఫారం 6,7,8 లను ప్రజల నుంచి స్వీకరించాలన్నారు. ఓటర్ జాబితాలో ఉన్న 80 సంవత్సరాల పైబడిన వృద్ధులను, దివ్యాంగులను గుర్తించాలన్నారు. బూతు లెవెల్ అధికారులు తప్పనిసరిగా నాలుగు రోజులపాటు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.