ఆర్మూర్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్‌గా ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు మధుశేఖర్‌ను సీఎం కేసీఆర్ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గల ఎంజె ఆస్పత్రిలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నూతనంగా నియమితులైన డాక్టర్ మధు శేఖర్‌ను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్ మాట్లాడుతూ అందరికీ సుపరిచితుడైన డాక్టర్ మధు శేఖర్‌ను ఆరోగ్యశాఖ రాష్ట్ర చైర్మన్‌గా ప్రభుత్వం నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ మధుశేఖర్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, టియుడబ్ల్యుజె, ఐజెయు జిల్లా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ అజీమ్, కోడె మనోహర్, రాజేష్, బిజి ప్రసాద్, కోడే స్వామి, యాహి యా ఫై తదితరులు పాల్గొన్నారు.