డిచ్‌పల్లి, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ఆచార్య. ఎం.యాదగిరికి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం గాయత్రి నగర్ నిజామాబాద్ వారు రాఖీ కట్టి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయం లక్ష్యాలను వివరించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య. ఎం. యాదగిరి మాట్లాడుతూ భారతీయ సమాజంలో పవిత్రమైన రక్షాబంధన్‌కు విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు. మానవీయ విలువలతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. నైతిక విలువలతో సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి భాయ్ విశ్వవిద్యాలయం కృషిని అభినందించాలని పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోవాలని, మంచి విద్య మేలైన సమాజ నిర్మాణం కోసం అధికారులు చేస్తున్న సేవలకు ఎలాంటి ఆటంకాలు రాకుడదని పవిత్ర హృదయంతో కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుసుమమ్మ బ్రహ్మకుమారి వనజ, సుజాత, నాగభూషణం మణికంట తదితరులు పాల్గొన్నారు.