కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలి…

నందిపేట్‌, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్‌ యోజన కార్యక్రమన్ని పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలని, బూత్‌ల వారిగా కొత్త వారిని చేర్చాలని కోరారు.

పైడి రాకెష్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి ఇదే చివరి ఎన్నిక అని ఇక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి రాజకీయ సన్యాసం పక్క అని బీజేపీ కార్యకర్తల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఈ నాలుగు నెలలు అత్యంత కీలకమైన రోజులని వివరించారు. అనంతరం నందిపెట్‌ గ్రామానికి చెందిన యువకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ పాలెపు రాజు, శ్రీనివాస్‌, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »