కామారెడ్డి, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనీ, ఇచ్చిన హామీలను గాలికి వొదిలేసి ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలనీ , ప్రజలను వంచించిన ప్రభుత్వం మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు. వచ్చే నెలలో హైద్రాబాద్లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు.