కామారెడ్డి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద మైనారిటీ విద్యార్థులకు సి.ఏం. ఓవర్సీస్ స్కాలర్షిప్ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్,సిక్కు, జైను, పార్శీ, బౌద్ధ మతానికి చెందిన పేద మైనారిటీలకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ స్కాలర్షిప్ అందజేయనున్నదని ఆయన తెలిపారు.
2023 సంవత్సరం స్ప్రింగ్ సీజన్ లో విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులు చదివేందుకు స్కాలర్షిప్ లేదా ఆర్ధిక సహాయం అందించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని ఆయన తెలిపారు. వార్షికాదాయం 5 లక్షల లోపు ఉండి , విదేశీ విశ్వ విద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులలోప్రవేశం తీసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటలలోగా కలెక్టరేట్ సముదాయం, 2వ అంతస్తులో గల మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొవాలని, వివరాలకు 8096973346 ఫోన్ నెంబరును సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.