మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కామారెడ్డి, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్‌ లు, పారశీ కులకు కామారెడ్డి పట్టణంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.

ఆసక్తి గల జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ నెల 30 లోగా తమ విద్యార్హతలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాన్ని జతపరచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని 2వ అంతస్తులో గల జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమాధికారి కార్యాలయం, రూమ్‌ నెంబర్‌ 222, నందు ధరఖాస్తు సమర్పించాలని, వివరాలకు 7306242629 ఫోన్‌ నెంబర్‌కు సంప్రదించవలసినదిగా కలెక్టర్‌ పేర్కొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »