బోధన్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతును రాజును చేయాలని కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతుబందు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుబంధు పథకం ఈ 2023 సంవత్సరం వర్షాకాలంలో 55 వేల 725 రైతులకు 54,11,33,419 రూపాయలను అందజేశామని తెలిపారు.
ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ ఆదేశానుసారం శనివారం రైతు బంధు పథకం బోధన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 11వ విడతల వారీగా అందించిన వివరాలు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రైతులకు ఇప్పటివరకు 529,14,96,113 రూపాయలను రైతులకు రైతు బంధు అందించారాని తెలిపారు.
ఎస్సి రైతులు 12 శాతం, ఎస్టీ రైతులు 14 శాతం బీసీ రైతులు 52శాతం ఈ రైతు బందు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అలాగే మొదటిసారి 5.90 లక్షల ఎకరాల విస్తీర్ణం గల పోడు రైతులకు రూ. 294.80 కోట్ల రూపాయల రైతుబంధును కొత్తగా అందజేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని తెలిపారు.