మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత

నిజామాబాద్‌, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో రూ. 6.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాల భవనాలు అత్యాధునిక వసతులు, అన్ని సదుపాయాలతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయని అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 17 మైనారిటీ స్కూల్స్‌ కం కాలేజీస్‌, మరో రెండు కళాశాలలు కలుపుకుని మొత్తం 19 విద్యా సంస్థలలో 7200 మంది విద్యార్థినీ విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వీరికి ప్రభుత్వం ప్రీ మెట్రిక్‌ స్కాలర్షిప్‌ కింద 9 కోట్ల 48 లక్షల రూపాయలను మంజూరు చేసిందని వివరించారు.

అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ఆరుగురు మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కీం కింద 20.60 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించిందని కలెక్టర్‌ తెలిపారు. మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అర్హులైన వారికి గ్రాంట్‌ రూపంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందన్నారు. ఇదివరకు బ్యాంక్‌ కాన్సెన్ట్‌ తో లబ్ధిదారులు తమవంతు వాటాను చెల్లిస్తే, సబ్సిడీ రూపంలో అర్హులకు రుణం మంజూరయ్యేదని గుర్తు చేశారు.

ప్రస్తుతం నేరుగా ప్రభుత్వం లబ్ధిదారులకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని లబ్ధిదారులకు కలెక్టర్‌ సూచించారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల జెడ్పి చైర్‌ పర్సన్లు దాదన్నగారి విఠల్‌ రావు, డి.శోభ, రాష్ట్ర మైనారిటీ విద్యా సంస్థల కార్యదర్శి షఫీ ఉల్లాఖాన్‌, మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ తారిక్‌ అన్సారి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మసిఉల్లా ఖాన్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దీన్‌, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »