బీబీపేట్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో శనివారం తెలంగాణ హరితహారం లో భాగంగా కోట మైసమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు.
ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలకు అంకురార్పణ చేశారని భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలి, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పం నుంచి పుట్టినదే తెలంగాణకు హరితహారమన్నారు.
గత పాలకుల హయాంలో మోడు వారిన ప్రాంతాలను సుభిక్షం చేసే విధంగా భవిష్యత్ తరాల కోసమే తెలంగాణ ప్రభుత్వం నేడు ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమం ఓక మహాయజ్ఞంలా చేపడుతుందన్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన హరితహరం జీవ వైవిధ్యానికి బలమైన పునాది వేసిందని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.
ఈ తొమ్మిదేండ్లలో హరితహారం పలితాలు అబ్బురపరిచేలా వున్నాయని విపరీతంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ బాపురెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్,టెక్నికల్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, అంగన్‌వాడి టీచర్ గోదావరి, డ్వాక్రా మహిళ సంఘ సభ్యురాళ్లు, గ్రామస్తులు శ్రీనివాస్, రాములు, బాలరాజు, కాశయ్య, గంగయ్య పాల్గొన్నారు.