బాన్సువాడ, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన బక్కని సాయిలు చెరువులో పడి మృతి చెందడంతో మత్స్యకారు పథకంలో భాగంగా ఎస్డిఆర్ఎఫ్ నుండి 4 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మృతుని భార్య మౌనికకు అందజేశారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి పద్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, సొసైటీ చైర్మన్ గంగుల గంగారం, నాయకులు వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మా గౌడ్, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.