కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 30లోగా రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం 15 శాతం లోపు ధాన్యం నిల్వ ఉన్న ఉన్న రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైస్ మిల్లర్స్ కు కేటాయించిన వానకాలం దాన్యమును ఎవరైతే త్వరితగతిన పూర్తి చేయకపోతే వారి ధాన్యాన్ని మరో రైస్ మిల్ కు షిఫ్టు చేస్తామని చెప్పారు. 2023-24 ఖరీఫ్ సీజన్ ధాన్యం లక్ష్యం పూర్తి చేయని రైస్ మిల్లకు ఇవ్వబోమని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరపరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, డిప్యూటీ తాసిల్దార్లు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.