కామరెడ్డి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్ హైదరాబాద్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్యరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో కామారెడ్డి రెడ్ క్రాస్ జూనియర్ మరియు యూత్ విద్యార్థులు పాల్గొన్నారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష,మనం దేశానికి రక్ష అని నినాదంతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, దేశాన్ని కాపాడడంలో సైనికుల పాత్ర ఎనలేనిదని, దేశ సైనికుల త్యాగాలు మరువలేనివని గవర్నర్ తెలియజేశారన్నారు.
ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు శ్రీనిధి, వాసవి, బ్లూ బెల్స్ పాఠశాల పిట్లం విద్యార్థులు శ్రీనిధి, స్నేహ, సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల మర్కల్ విద్యార్థిని రుచిత పాల్గొన్నారు.