రెంజల్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కును నమోదు చేయాలని ఆర్డీవో రాజు గౌడ్ అన్నారు. శుక్రవారం రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 18 సంవత్సరాల నుండి ఉన్న యువతీ, యువకులకు ఓటు హక్కును నమోదు చేయాలని బిఎల్వోలకు సూచించారు.
ఓటర్ లిస్టులో తప్పొప్పులు ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చని బిఎల్వోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శంకర్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.