కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 2,3 తేదీలలో జిల్లాలోని 791 పోలింగ్ కేంద్రాలలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకై స్పేషల్ క్యాంపేయిన్ డే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలలో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంబంధిత బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని, ప్రజలు ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓల వద్ద నున్న జాబితా ఆదారంగా తమ పేర్లను, వివరాలును సరిచూసుకోని అభ్యంతరాలు, ఆక్షేపనలు, ఉన్నట్లయితే తెలియజేయాలని కోరారు.