9న లోక్‌ అదాలత్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయ భవనంలో శనివారం చట్టాలపై అవగాహనా కార్యక్రమం మరియు లోక్‌ ఆదాలత్‌ నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసెక్యూషన్‌ ఆదేశాల మేరకు మొదటి శనివారం కామారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పోలీసు అధికారులకు విద్యుత్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈనెల 9న నిర్వహించే నేషనల్‌ లోక్‌ ఆదాలత్‌ విజయవంతం చేయాలని, కేసులో విచారణలో లొసుగులు లేకుండా చూసుకోవాలని సూచించారు.

సమావేశంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసెక్యూటర్‌ అశోక్‌ శివరాం నాయక్‌, పబ్లిక్‌ ప్రాసెక్యూటర్‌ టీ. రాజ్‌ గోపాల్‌ గౌడ్‌, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు నందు రమేశ్‌, నిమ్మ దామోదర్‌ రెడ్డి, శేషు మరియు కామారెడ్డి పట్టణ సీఐ నరేష్‌ భిక్నూర్‌ సీఐ తిరుపయ్య, సదాశివనగర్‌ సీఐ రామన్‌ మరియు కామారెడ్డి సబ్‌ డివిజన్‌ ఎస్సైలు, అటవి శాఖ ఆదికారులు, కోర్టు లైసనింగ్‌ ఆఫీసర్‌ శ్రీరాం హన్మాండ్లు, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »