ఆర్మూర్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో శనివారం పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ కే. ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షించారు. ఈ తనిఖీలో పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఫర్ ఫార్మెన్స్, నగదు బదిలీ, కొత్త పథకాలు, ఇన్సూరెన్స్, పోస్టాఫీసులోని వివిధ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
నూతన ఖాతాల ఓపెనింగ్‌లో తెలంగాణ సర్కిల్‌ను ప్రథమ స్థానంలో నిలిపిన భీంగల్ మండలంలోని పిప్రి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎస్.కె.అప్సర్‌ను శాలువతో సన్మానించి అభినందించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఎన్ .అనిల్ కుమార్, ఆర్మూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ అధికారిణి యాపరు సురేఖ, ఆర్మూర్ హెడ్ పోస్ట్ మాస్టర్ కే. అజయ్ కుమార్, జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్పీఎం ఆంజనేయులు, ఎం.వోలు దశరథ్, చంద్రశేఖర్ బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.