సామాన్యులకు గుడ్‌ న్యూస్‌..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న బడుగు జీవులకు ఇది ఒక గుడ్‌ న్యూస్‌. ఇటీవల భారీగా పెరిగి భయపెట్టిన టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టమాటా ధరలు చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.200 వరకు చేరుకున్నాయి. దాదాపు రెండుమూడు నెలలపాటు అదే ధర కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టగా, తాజాగా హైదరాబాద్లోని సరూర్నగర్‌ మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 15కు పడిపోయింది. వంకాయ, దొండ, బెండ, కాకరకాయ, పచ్చిమిప సహా ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

చాలామంది రైతులు నేరుగా రైతు బజార్లకే తెచ్చి విక్రయిస్తుండడం, డిమాండ్‌ కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ఏపీలోని మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా అత్యల్పంగా రూ. 5 నుంచి రూ. 9 మధ్య పలికింది. అలాగే, మహారాష్ట్రలోని సోలాపూర్‌, కర్ణాటకలోని చిక్బల్లాపూర్‌, కోలార్‌, చత్తీస్గఢ్లోని రాయపూర్‌ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »