లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నవనాతపురం ఆధ్వర్యంలో అధ్యక్షులు మోహన్‌ దాస్‌ మంగళవారం లయన్స్‌ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌దాస్‌ మాట్లాడుతూ గౌరవనీయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనం యేటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని, ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భారత రాష్ట్రపతిగా అతున్నత స్థానానికి చేరుకున్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినమును పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు.

ఆర్మూర్‌ పరిసర ప్రాంతాల నుండి 35 ఉపాధ్యాయులను జ్ఞానరత్న అవార్డ్‌తో సత్కరించామని అన్నారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి చెరుకు ప్రీథ్వీ రాజ్‌, ప్రాజెక్ట్‌ చైర్మన్‌ రాజన్న,లయన్స్‌ క్లబ్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్స్‌ సుధీర్‌ బాబు, శివరాజ్‌ కుమార్‌, లయన్స్‌ సభ్యులు జ్ఞానీ చావుల, కొంగి మనోహర్‌, మ్యాక శ్రీకాంత్‌, శ్రీధర్‌, శశికాంత్‌ రెడ్డి, హేమ లత, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »