సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గురువారం సీజనల్‌ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, పాత కుండలు పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా అభివృద్ధి చెంది డెంగ్యూ, చికెన్‌ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి మరియు దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ సబ్‌ యూనిట్‌ అధికారి సాయి, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్‌, ఆనంద్‌, ఆశా కార్యకర్తలు శిరీష, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »