డిచ్పల్లి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఆచార్య గంటా చంద్రశేఖర్‌ను సోషల్ సైన్సెస్‌కు డీన్‌గా రెండు సంవత్సరాలకు నియామకం ఉత్తర్వులను అందజేశారు.
గతంలో ఆచార్య గంట చంద్రశేఖర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, మరియు పరీక్షల నియంత్రణ అధికారిగా, పని చేశారు. ప్రస్తుతం ఆచార్య గంటా చంద్రశేఖర్ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నియామకపు ఉత్తర్వులు అందుకున్న ఆచార్య గంట చంద్రశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగం పంచుకుంటామని సామాజిక శాస్త్రంలో జరిగే మార్పులకు అనుగుణంగా పరిశోధనలు కొనసాగించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆచార్య గంటా చంద్రశేఖర్ సోషల్ సైన్సెస్ డీన్‌గా నియామకపు ఉత్తర్వులు అందించినందుకు వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్టార్లకు కృతజ్ఞతలు తెలిపారు.