ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల పై అవగాహన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో మార్పులు – చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం తదితర అంశాలపై అధికారులు వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా నేతృత్వంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికల ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరు విధిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో తప్పనిసరిగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదుకై కల్పిస్తున్న వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేర్లు కలిగిన వారు ఏవైనా మార్పులు – చేర్పులు ఉంటే సంబంధిత నిర్ణీత దరఖాస్తు ఫారం అందించి సరిచేసుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ ఓటర్లకు అవగాహన కల్పించారు. కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వి.వి.ప్యాట్‌ ల పనితీరు గురించి తెలియజేస్తూ ఓటర్ల అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎన్నికల నోడల్‌ అధికారి సింహాచలం, సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »