డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.

ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మూడవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 8812 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7803 మంది హాజరు, 1009 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 34 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 31 మంది హాజరు, 03 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.

మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు డిగ్రీ ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 7426 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6780 మంది హాజరు, 646 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.

ఉదయం మూడవ సెమిస్టర్‌లో బోధన్‌లోని ఎస్‌వి డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో బాటనీలో ఇద్దరు, ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎకనామిక్స్‌లో ఒకరు, మధ్యాహ్నం బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌లో ఇద్దరు, బాటనీలో ఒక్కరు, ఫిజిక్స్‌లో ఒకరు మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు సివోఇ పేర్కొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »