ఆర్మూర్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మామిడిపల్లి 44వ నెంబరు జాతీయ రహదారి ప్రధాన రహదారి మల్లన్న గుడి నుండి గ్రామానికి వచ్చే దారికి సర్వీస్ రోడ్ లేనందున పశువులు, రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు.
అనేక పశువులు చనిపోయాయి. కాగా శుక్రవారం మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హైదరాబాద్ నివాసంలో కలిసి సమస్య విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు గ్రామ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్ కొరకు షెడ్డు మంజూరు చేయాలని కోరగా వెంటనే ఛైర్‌పర్సన్‌తో మాట్లాడి మంజూరు ఇప్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల రాము, సంగీత, రవి గౌడ్, కవిత కాశిరం, వైస్ చైర్మన్ మున్నా, ఇట్టేది నర్సారెడ్డి పండిత్ పవన్, విడిసి సభ్యులు పేట గంగారెడ్డి, గోజురి ప్రవీణ్, నారాయణ, అశోక్, పోశెట్టి కుల పెద్దలు పాల్గొన్నారు.