బాన్సువాడ, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి గొప్పగా చేశామని చెబుతున్నారని అభివృద్ధి ఎంత ఉందో అంతకు రెండిరతలు ప్రజాధనాన్ని పోచారం కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీర్కూరు మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నియోజకవర్గస్థాయి స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారని పార్టీ కొరకు పనిచేసే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేరిస్తే అమరవీరుల త్యాగదనుల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం మోపారన్నారు.
తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీకి రుణం తీర్చుకునే అవకాశం మనకు కలిగిందని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు నాయకులు కార్యకర్తలు సమస్య కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం నాయకులతో కలిసి మంజీర శివారులో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇసుకను దోచేయడం వల్ల మంజీర ప్రాంతం భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ఇసుక నిల్వలను సీజ్ చేయాలని ఆర్డీవో అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మోస్రా, చందూర్, బాన్సువాడ, కోటగిరి, పోతంగల్ వర్ని మండలాలకు చెందిన టిఆర్‌ఎస్ బిజెపి పార్టీ కార్యకర్తలు కాసుల బాలరాజ్ సమక్షంలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈనెల 17న హైదరాబాద్లోని తుక్కుగూడలో జరిగే సోనియా గాంధీ బహిరంగ సభకు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, హాన్మండ్లు, సానిపు గంగారం, నందకిషోర్ రెడ్డి, మంత్రి గణేష్, పోతురాజు శ్రీనివాస్, బోయిని శంకర్, షాహిద్, లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, దొంతురం కాశిరాం, రూప్ సింగ్, పర్వారెడ్డి, వెంకటరెడ్డి, నవీన్ రెడ్డి, నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.